రూ. 4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sandal wood seized by chittoor police | Sakshi
Sakshi News home page

రూ. 4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jul 31 2016 10:29 AM | Updated on Sep 4 2017 7:13 AM

చిత్తూరు రూరల్ పరిధిలో 196 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు : తమిళనాడులోని కృష్ణగిరి, చిత్తూరు రూరల్ పరిధిలో 196 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 4 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement