వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ | recruitment of handicaps backlog posts | Sakshi
Sakshi News home page

వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

Jul 27 2016 11:38 PM | Updated on Sep 4 2017 6:35 AM

వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను మెరిట్‌ ఆధారంగా అర్హత సాధించిన వారితో భర్తీ చేసినట్లు కలెక్టర్‌ జగన్మోహన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాక్‌లాగ్‌ కోటాలో 18 మంది వికలాంగులకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులను సంబంధిత అభ్యర్థులకు అందజేశారు.

ఆదిలాబాద్‌ : వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను మెరిట్‌ ఆధారంగా అర్హత సాధించిన వారితో భర్తీ చేసినట్లు కలెక్టర్‌ జగన్మోహన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాక్‌లాగ్‌ కోటాలో 18 మంది వికలాంగులకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులను సంబంధిత అభ్యర్థులకు అందజేశారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి మహిళ–1, మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌–3, కార్యాలయం సబార్డినేట్‌–2, వాచ్‌మన్‌–1, కుక్‌–1, నర్సింగ్‌ ఆర్డర్లి–1, పబ్లిక్‌ హెల్త్‌వర్కర్‌–6, మహిళ వెల్ఫేర్‌ వర్కర్‌–1, ప్లాంటేషన్‌ లేబర్‌–1, కామాటి–1 పోస్టులు ఉన్నాయి. 18 మందిలో 9 అంధులు, 9 మందివికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వికలాంగ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement