70 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | ration rice seized in vellampalli | Sakshi
Sakshi News home page

70 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Jan 7 2016 8:56 AM | Updated on Sep 3 2017 3:16 PM

అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మద్దిపాడు: అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామ సమీపంలో ఓ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లారీని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని వెల్లంపల్లి కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉండటంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘావేసి బియ్యం లోడుతో వస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement