నా నుంచి అభిమానులు ఏమి... | rashmi gautam interview with sakshi | Sakshi
Sakshi News home page

నా నుంచి అభిమానులు ఏమి...

Sep 24 2016 10:25 AM | Updated on Sep 4 2017 2:48 PM

నా నుంచి అభిమానులు ఏమి...

నా నుంచి అభిమానులు ఏమి...

నగరంలో ‘తను వచ్చెనంట’ సినిమా టీమ్ సందడి చేసింది.

30న సినిమా విడుదల
రేష్మీ గౌతమ్

 
బీచ్‌రోడ్: నగరంలో ‘తను వచ్చెనంట’ సినిమా టీమ్ సందడి చేసింది.  తేజ, రేష్మీగౌతమ్ హీరో, హీరోయిన్లగా.. చలాకి చంటి ముఖ్యపాత్రలో చిత్రం రూపొందింది. వెంకట కాచర్ల దర్శకత్వంలో నిర్మాత చంద్ర శేఖర్ ఆజాద్ నిర్మించారు.
 
ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్భంగా నగరంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం ఆర్కేబీచ్ దగ్గర వున్న ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వ ర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. నా నుంచి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో అన్నీ ‘తనువచ్చెనంట’లో ఉంటాయన్నారు.
 
హీరో తేజ మాట్లాడుతూ ఇది హర్రర్, రొమాంటిక్ కామెడీ సినిమా అన్నారు.  చిత్రంలో కామెడీ అద్భుతంగా పండిందన్నారు. తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు.  నిర్మాత చంద్రశేఖర్, సహాయ నిర్మాత యశ్వాంత్ తదితరులు పాల్గొన్నారు.
 
 బీచ్‌ను చూస్తూ కాఫీ తాగితే ఆ కిక్కే వేరబ్బా...!

సాగర్ తీరంలో పార్కేలేటర్ కాఫీ హౌస్ నిర్వహించిన సెల్ఫీ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన పదిమందితో తను వచ్చెనంట సినిమా టీమ్ డిన్నర్ చేసింది. రేష్మీ గౌతమ్, నటుడు చెలాకీ చంటీ తదితరులు యువతీయువకుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా పార్కెలేటర్ కాఫీ హౌస్ యజమాని మనుదీప్ రెడ్డి మాట్లాడుతూ షాపునకు వచ్చిన కస్టమర్లకు సెల్ఫీ పోటీలు నిర్వహించామని, వీరిలో పదిమందిని ఎంపిక చేశామన్నారు.

ఈ సందర్భంగా  రేష్మీ గౌతమీ మాట్లాడుతూ బీచ్‌ను చూస్తూ కాఫీ తాగడం చాలా ఇష్టమన్నారు. నటుడు చంటి మాట్లాడుతూ వైజాగ్ బీచ్‌ను ఎన్ని సార్లు చూసినా తనివితీరదన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ఫీ కాంటెస్ట్ విజేతలు రేష్మీ, చంటిలతో సెల్ఫీలు, ఫొటోలు తీయించుకుని సందడిగా గడిపారు.

Advertisement
 
Advertisement
Advertisement