మానసిక వికలాంగురాలిపై అత్యాచారం | rape attempt on mentaly handicaped | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

Jan 9 2017 12:54 AM | Updated on Oct 16 2018 4:50 PM

మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన సుంకేనాయక్‌ ఆదివారం సాయంత్రం అత్యాచారం చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కొత్తపల్లి(మద్దికెర): మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన సుంకేనాయక్‌ ఆదివారం సాయంత్రం అత్యాచారం చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొత్తపల్లికి చెందిన యువతి మానసిక వికలాంగురాలు. సుంకేనాయక్‌ కొత్తపల్లికి కూలీ పనులకు వచ్చి సాయంత్రం తిరిగి వెళ్తుండగా, గ్రామ సమీపంలోని పొలంలో మానసిక వికలాంగురాలు ఒంటరిగా కనబడటంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపే యత్నం చేస్తుండగా, కొత్తపల్లి గ్రామస్తులు గమనించి కేకలు వేసుకుంటూ వచ్చేలోగా పారిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రులు, గ్రామస్తులు మద్దికెర పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు సుంకేనాయక్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రెడ్డిహుసేన్‌ విలేకరులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పత్తికొండ సీఐ బి.వి.విక్రంసింహా మద్దికెర పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితురాలిని, తల్లిదండ్రులను విచారించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement