రామకృష్ణారెడ్డి మరోసారి బరిలోకి | ramakrishna reddy another time | Sakshi
Sakshi News home page

రామకృష్ణారెడ్డి మరోసారి బరిలోకి

Feb 12 2017 12:32 AM | Updated on Oct 17 2018 5:10 PM

నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండోసారి బరిలోకి దిగుతున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి ప్యానల్‌ తరఫున ఆదివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్‌ వెంగళరెడ్డి, జవహార్‌లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి ఆయన పేరును ప్రతిపాదించనున్నారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు ¯సంబంధించి నేడు జరిగే  నామినేషన్‌ కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం పూర్తిగా రామకృష్ణారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement