మారిన రైళ్ల రాకపోకల వివరాలు | railway timings changed | Sakshi
Sakshi News home page

మారిన రైళ్ల రాకపోకల వివరాలు

Sep 30 2016 10:23 PM | Updated on Sep 4 2017 3:39 PM

ఏలూరు రైల్వేస్టేçÙన్‌ మీదుగా వెళ్లే మూడు రైళ్ల రాకపోకల వేళలు శనివారం నుంచి మారినట్టు ఏలూరు రైల్వేస్టేçÙన్‌ మేనేజర్‌ ఏవీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లే 22416 నంబర్‌ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇక నుంచి మధ్యాహ్నం 1.10కి వచ్చి 1.12కి బయలుదేరుతుందన్నారు.

ఏలూరు అర్బన్‌ : ఏలూరు రైల్వేస్టేçÙన్‌ మీదుగా వెళ్లే మూడు రైళ్ల రాకపోకల వేళలు శనివారం నుంచి మారినట్టు ఏలూరు రైల్వేస్టేçÙన్‌ మేనేజర్‌ ఏవీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లే 22416 నంబర్‌ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇక నుంచి మధ్యాహ్నం 1.10కి వచ్చి 1.12కి బయలుదేరుతుందన్నారు. హౌరా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే 18645 నంబర్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9.15కి ఏలూరు వచ్చి 9.17కి వెళుతుందని చెప్పారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లే 12806 నంబర్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 2.15 నిమిషాలకు వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని విజ్ఞప్తి చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement