'ఆ హామీలను బీజేపీ అమలు చేయాలి' | raghuveera reddy takes on bjp | Sakshi
Sakshi News home page

'ఆ హామీలను బీజేపీ అమలు చేయాలి'

Aug 15 2015 12:26 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేయాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేయాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో రఘువీరా రెడ్డి.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను బీజేపీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఏపీ రాజధాని కోసం 34 వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం.. వాటిని ఏం చేయబోతుందో చెప్పాలని ఈ సందర్భంగా రఘువీరా డిమాండ్ చేశారు. ఆ భూములను 99 ఏళ్ల పాటు సింగపూర్, జపాన్ కంపెనీలకు లీజుకు ఇవ్వాలనుకోవడం దారుణమని రఘువీరా మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement