'2019 తో టీడీపీ ఆయుష్షు ఖతం' | Raghuveera reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'2019 తో టీడీపీ ఆయుష్షు ఖతం'

May 30 2016 5:56 PM | Updated on Sep 4 2017 1:16 AM

2019 తో తెలుగుదేశం పార్టీ ఆయుష్షు ముగిసిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.

విజయవాడ: 2019 తో తెలుగుదేశం పార్టీ ఆయుష్షు ముగిసిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. 2050 వరకు తానే సీఎం అంటూ చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. దీనిపై జూన్లో సీఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని రఘువీరా విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement