నల్లగొండలో సూదిసైకో కలకలం | psycho with injucton attacked in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండలో సూదిసైకో కలకలం

Sep 12 2015 2:54 PM | Updated on Sep 3 2017 9:16 AM

తెలుగు రాష్ట్రాల్లో సూదిగాళ్ల కలకలం రోజురోజుకూ ఎక్కువైపోతోంది.

నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో సూదిగాళ్ల కలకలం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. నల్లగొండ జిల్లాలో కోదాడలో రెండు రోజుల కింద జరిగిన సూది దాడి మరవకముందే సూదిసైకో శనివారం మరో దాడి చేశాడు. మోళ్ల చెర్వు మండలం రామాపురం వద్ద బైక్ పై వెళ్తున్న నర్సింహా రావుకు సూదిగుచ్చి సైకో పరారయ్యాడు.

బైక్ పై హెల్మెట్ పెట్టుకొని వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం. బాధితున్ని హుజూర్ నగర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సూది సైకో కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement