మొక్కలను కాపాడడమే ప్రతిఒక్కరి ధ్యేయం | protuct the plants | Sakshi
Sakshi News home page

మొక్కలను కాపాడడమే ప్రతిఒక్కరి ధ్యేయం

Jul 20 2016 6:54 PM | Updated on Sep 4 2017 5:29 AM

మొక్కలు నాటడమే కాదు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలం బోర్నపల్లి, చింతలూరు, రామాజీపేట, ఇటిక్యాల గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రామాజీపేటలో జెడ్పీ నిధులతో మంజూరైన బోర్‌ను ప్రారంభించారు.

  • ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
  • రాయికల్‌ : మొక్కలు నాటడమే కాదు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలం బోర్నపల్లి, చింతలూరు, రామాజీపేట, ఇటిక్యాల గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రామాజీపేటలో జెడ్పీ నిధులతో మంజూరైన బోర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పడాల పూర్ణిమ, జెడ్పీటీసీ గోపీ మాధవి, సర్పంచులు కోల లక్ష్మి, కదుర్ల లక్ష్మి, రామాజీపేటలో వాసరి రవి, ఇటిక్యాలలో నీరటి శ్రీనివాస్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి మహేందర్, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, అనుపురం లక్ష్మి, తహసీల్దార్‌ చంద్రప్రకాశ్, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మహిపాల్‌రెడ్డి, దివాకర్, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి భాగ్యలక్ష్మి రాయికల్, ద్వితీయ సుమలత రాయికల్, తృతీయ జ్యోతి ధర్మాజీపేటలు గెలుచుకున్నారు. వీరికి ఎంపీపీ పడాల పూర్ణిమ బహుమతులు అందజేశారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement