అమ్మపై ప్రేమతో... లక్షల మొక్కలు నాటిన పోకిరి నటుడు | Sayaji Shinde plants Trees of his Mother Name | Sakshi
Sakshi News home page

Sayaji Shinde: అమ్మపై ప్రేమతో... లక్షల మొక్కలు నాటిన పోకిరి నటుడు

Jun 1 2026 4:09 PM | Updated on Jun 2 2026 8:02 AM

Sayaji Shinde plants Trees of his Mother Name

పోకిరి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో  టాలీవుడ్ నటుడు షాయాజీ షిండి. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  తన డైలాగ్స్, మేనరిజంతో ఫ్యాన్స్‌ను తెగ నవ్వించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వెండితెరపై పవర్‌ఫుల్ విలన్‌గా.. కమెడియన్‌గా మెప్పించారు 

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజసేవలో పాటుపడుతున్నారు షాయాజీ షిండే. పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు 6.5 లక్షల చెట్లతో ఒక చిన్న అడవినే సృష్టించాడు. షాయాజీ షిండే నిజ జీవితంలో ఒక అద్భుతమైన హీరో అనిపించుకుంటున్నారు.  ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తూ లక్షలాది మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. తన తల్లిపై ప్రేమతో మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు.  ‍అమ్మ చనిపోయినప్పుడు ఆమె బరువుకు సమానంగా విత్తనాలు నాటినట్లు తెలిపారు. అవే ఇప్పుడు లక్షల మొక్కలై నాకు తోడుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement