జిల్లా ఏర్పాటు కోరుతూ చేవెళ్ల బంద్ | protest in chevella about special district | Sakshi
Sakshi News home page

జిల్లా ఏర్పాటు కోరుతూ చేవెళ్ల బంద్

May 21 2016 1:26 PM | Updated on Sep 4 2017 12:37 AM

జిల్లా ఏర్పాటు కోరుతూ చేవెళ్ల బంద్

జిల్లా ఏర్పాటు కోరుతూ చేవెళ్ల బంద్

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో బంద్ నిర్వహించారు.

చేవెళ్ల: తెలంగాణ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తమ పట్టణ కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పట్టణంలో అన్ని దుకాణాలను బంద్ చేయించారు. రహదారిపై బైఠాయించి చేవెళ్ల జిల్లాను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement