ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం | problems solution is movements | Sakshi
Sakshi News home page

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం

Jul 24 2016 6:50 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం - Sakshi

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం

విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తేనే పరిష్కారం లభిస్తుందని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్క్‌ వద్ద ఈనెల 27న భారీ ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తేనే పరిష్కారం లభిస్తుందని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్క్‌ వద్ద ఈనెల 27న భారీ ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయుల, విద్యార్థి సంఘ నేతలు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమించాల్సి వస్తుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నప్పటికీ.. వాటికి అవసరమైన నిధులతోపాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు పరమేష్, ఏవీ.సుధాకర్, రాజశ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement