జిల్లాలోని మునగాల మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రైవేటు బస్సు బోల్తా
Nov 30 2016 6:49 AM | Updated on Sep 4 2017 9:32 PM
సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్వాయి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Advertisement


