ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు | Principal BABURAO arrested | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు

Mar 2 2016 6:45 PM | Updated on Aug 24 2018 2:36 PM

ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు - Sakshi

ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు

నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బాబురావును ఎట్టకేలకు పెదకాకాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బాబురావును ఎట్టకేలకు పెదకాకాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను ప్రోత్సహించినందుకు ఆయనను అరెస్టు చేయాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో అమెరికాకు పారిపోయాడు. ఈ క్రమంలో తిరిగి ఇండియాకు వచ్చిన ఆయనను గుంటూరులోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకుని రెండు వారాల రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement