విద్యతోనే సామాజిక న్యాయం సాధ్యం
: సమాజంలోని అట్టడుగు వర్గాలవారు సైతం విద్యావంతులైతేనే సామాజిక న్యాయం సాధ్యమని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జీవీ రామకృష్ణారావు అన్నారు
– రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణారావు
ఒంగోలు: సమాజంలోని అట్టడుగు వర్గాలవారు సైతం విద్యావంతులైతేనే సామాజిక న్యాయం సాధ్యమని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జీవీ రామకృష్ణారావు అన్నారు. శనివారం స్థానిక శర్మా కాలేజీలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ‘దక్షిణ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం– అనుభవాలు, సవాళ్లు ’ అంశంపై జరిగిన జాతీయ స్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులైన సమాజం విజ్ఞానం వైపు తొంగిచూస్తుందన్నారు. బౌద్ధుని కాలంలో సైతం ఇందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెన్నైకి చెందిన సెంట్రల్ ఎకై్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.షణ్ముగం మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం వివక్ష ఎలా కొనసాగేది, స్వాతంత్య్రం తరువాత ఎంతవరకు అణగారిన వర్గాలు అభివృద్ధి ఫలాలను అందుకోగలిగాయనే దానిపై మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నట్లు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలన్నారు. అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి సంస్థ పేదవాడికి సైతం అత్యున్నత విద్య అందుకునే అవకాశాలు కల్పిస్తే మరో రెండు దశాబ్దాల్లో దేశం మొత్తంమీద సామాజిక న్యాయం సిద్దించడం ఖాయం అన్నారు. న్యూడిల్లీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూయూనివర్శిటీ ప్రొఫెసర్ యాగాటి చిన్నారావు మాట్లాడుతూ సామాజిక న్యాయం పొందడానికి శతాబ్ధాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం లభించాలనే ఉద్దేశ్యంతోనే సామ్యవాదం ఉద్భవించిందనేది అక్షర సత్యం అన్నారు. ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా వివక్షలేని సమాజం సృష్టించడం ద్వారా సమానత్వం వైపు అడుగులు వేయడం సా««దl్యపడుతుందంటూ పలు ఉదాహరణల ద్వారా శర్మా కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శర్మా కాలేజీ అధ్యాపకులుగా పనిచేసి శనివారం రిటరైన చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కె.శ్రీనివాసులును పురావస్తు శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణారావు దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.