ప్రపంచంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది: ఎంపీ కవిత | politics Telangana create history in world: kavitha | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది: ఎంపీ కవిత

Aug 1 2016 2:42 AM | Updated on Sep 4 2017 7:13 AM

ప్రపంచంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది: ఎంపీ కవిత

ప్రపంచంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది: ఎంపీ కవిత

ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

నిజామాబాద్ అర్బన్: ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని స్థానిక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పర్యావరణాన్ని కాపాడేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు.

హరితహారం, మిషన్ కాకతీయ పేరిట రాష్ట్రం చరిత్ర సృష్టించిందన్నారు. ఈ  కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గు ప్త, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మె ల్సీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement