ఎర్రచందనం దుంగల పట్టివేత | Police seizes 30 red-sandal wood logs | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల పట్టివేత

Jun 9 2016 7:43 AM | Updated on Aug 21 2018 5:54 PM

జిల్లాలోని తడ మండలం భీమునివారిపాళెం గ్రామ సమీపంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను తడ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు: జిల్లాలోని తడ మండలం భీమునివారిపాళెం గ్రామ సమీపంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను తడ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ముందే వచ్చిన సమాచారంతో చెక్ పోస్టుల వద్ద పక్కా నిఘా పెట్టిన పోలీసులు తెల్లవారుజామున వస్తున్న రెండు కార్లను తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పారిపోతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement