పోలీసుల ఓవర్ యాక్షన్ మూలంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు: పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొన్నూరు మండలం చింతలపుడిలో పోలీసులు ఆదివారం చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారున్ని అకస్మాత్తుగా ఏఎస్ఐ లాగడంతో.. గమనంలో ఉన్న వాహనదారుడు కిందపడిపోయాడు. తీవ్రగాయాలయిన అతన్ని గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెకింగ్ పేరుతో పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.