ప్రార్థనకంటూ వెళ్లి.. | Person Missing in chandrayanagutta | Sakshi
Sakshi News home page

ప్రార్థనకంటూ వెళ్లి..

Aug 3 2016 6:14 PM | Updated on Sep 4 2018 5:21 PM

ప్రార్థనలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో జరిగింది.

ప్రార్థనలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం....షమా టాకీస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అలీముద్దీన్(53) సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు.

 

కాగా గత నెల 5వ తేదీనా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నమాజ్ చేసేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అలీముద్దీన్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అతని భార్య సాబెరా బేగం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement