రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Dec 1 2016 2:25 AM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన 65వ నంబర్ జాతీయ రహాదారిపై మునగాల మండలం

ఆకుపాముల(మునగాల): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన  65వ నంబర్ జాతీయ రహాదారిపై మునగాల మండలం కుపాముల శివారులో గంగమ్మ గుడి ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన షేక్ షరీఫ్(53) నడిగూడెం మండల కేంద్రంలో వైన్‌షాపులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగ మంగళవారం రాత్రి 11గంటలకు తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై నడిగూడెం నుంచి కోదాడకు వెళుతూ మార్గమధ్యలో ఆకుపాముల శివారులో ఆగ ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో షరీఫ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ ఖరీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement