శుభకార్యానికి వెళ్తూ...అనంతలోకాలకు | person died in road accident | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్తూ...అనంతలోకాలకు

May 8 2017 12:13 AM | Updated on Sep 28 2018 3:41 PM

బంధువుల శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

- రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.
 
మెరుగుదొడ్డి(సి.బెళగల్‌): బంధువుల శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కోడుమూరు మండలం మెరుగుదొడ్డి గ్రామానికి కురువ తిమ్మప్ప(32) గ్రామం నుంచి తన భార్య తరఫు బంధువుల వివాహానికి కోసిగి మండలం దొడ్డిమేకల గ్రామానికి స్కూటర్‌పై బయలుదేరి వెళ్లాడు. ఎమ్మిగనూరు శివారులోని కోసిగి రోడ్డులో స్కూటర్‌ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇంటి నుంచి వివాహానికి వెళ్లేటప్పుడు గోనెగండ్ల మండలం ఎర్రకోట గ్రామంలో మరొక బంధువుల వివాహానికి తిమ్మప్ప తల్లి నాగమ్మను వదిలివెళ్లినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య మహలింగమ్మ, మతిస్థిమిం సరిగాలేని కుమారుడు మహేంద్ర ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement