తాగు, సాగునీరివ్వాలని ధర్నా | people protest for water | Sakshi
Sakshi News home page

తాగు, సాగునీరివ్వాలని ధర్నా

Aug 30 2017 10:46 PM | Updated on Oct 4 2018 4:40 PM

తాగు, సాగునీరివ్వాలని ధర్నా - Sakshi

తాగు, సాగునీరివ్వాలని ధర్నా

తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు తాగు, సాగు నీరివ్వాలని అక్కడి గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేశారు.

అనంతపురం అర్బన్‌: తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు తాగు, సాగు నీరివ్వాలని అక్కడి గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ క్రమంలో తాడిపత్రి పరిధిలోని మండలాలకు చెందిన రైతులు, ప్రజలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

గత 50 ఏళ్లగా తమ ప్రాంతాలకు మొదటి విడతలో నీరు ఇవ్వడం లేదన్నారు. రెండో విడతలో అరకొరగా ఇస్తుండటంతో చివరగా ఉన్న చెరువులకు నీరు చేరడం లేదన్నారు. దీంతో తాగు, సాగు నీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ సారైనా తమకు ముందుగా నీటిని ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement