పవన్ నాకు దేవుడు | pawan kalyan is my god - puri | Sakshi
Sakshi News home page

పవన్ నాకు దేవుడు

Dec 15 2015 1:29 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ నాకు దేవుడు - Sakshi

పవన్ నాకు దేవుడు

‘మీకు పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్ అయితే.. నాకు దేవుడు’.. అని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్

దర్శకుడు పూరీ జగన్నాథ్
అభిమానుల కోలాహలం మధ్య లోఫర్ ఆడియో సక్సెస్ మీట్

 
చినకాకాని(మంగళగిరి రూరల్): ‘మీకు పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్ అయితే.. నాకు దేవుడు’.. అని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో సోమవారం రాత్రి లోఫర్ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లోఫర్ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదన్నారు. హీరోయిన్ దిషా పఠానీ తొలి చిత్రంలోనే చక్కగా నటించిందని, చాలా మంచి డ్యాన్సర్ అని కొనియాడారు. హీరో వరుణ్‌తేజ్ నటన అద్భుతమన్నారు.

మెగా కుటుంబంలో పెద్ద హీరోగా పేరుతెచ్చుకుంటారని చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూస్తే తప్పకుండా వరుణ్ ఫ్యాన్స్ అవుతారని, సినిమా అంత బాగా వచ్చిందని తెలిపారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ లోఫర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అశోక్‌కుమార్, మ్యూజిక్ డెరైక్టర్ సునీల్ కస్యప్, అసోసియేట్ డెరైక్టర్ కేఎస్ రాజు, హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, జీఎం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
                                                 
 
 

Advertisement
 
Advertisement
Advertisement