breaking news
Lofar
-
అతి పే.....ద్ద రేడియో జెట్
ఇదేమిటో తెలుసా? ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కిన అతి పెద్ద రేడియో జెట్. కాంతివేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్, అంతరిక్ష ధూళితో కూడిన ప్రవాహాలు. క్వాజార్గా పిలిచే కృష్ణబిలాల సమూహాలు నుంచి ఇవి పుట్టుకొస్తుంటాయి. వీటి ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం ఇదే తొలిసారి. ఈ రేడియో జెట్ ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకుని ఉన్నట్టు తేలడం సైంటిస్టులనే విస్మయపరుస్తోంది. అంటే పాతపుంత కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది! డర్హాంకు చెందిన పరిశోధకుల బృందం ఇంటర్నేషనల్ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) టెలిస్కోప్ ద్వారా దీన్ని ఉనికిని కనిపెట్టింది. ఇది విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడ్డ జే1601+3102 అనే క్వాజార్ నుంచి పుట్టుకొచ్చిన రేడియో జెట్ అని నిర్ధారణయింది. దీని పుట్టుకకు కారణమైన కృష్ణబిలం పరిమాణంలో మరీ పెద్దదేమీ కాకపోవడం సైంటిస్టులను మరింత ఆశ్చ ర్యపరుస్తోంది. అతి భారీ కృష్ణబిలాలు మా త్రమే భారీ రేడియో జెట్లకు జన్మనిస్తాయని భావించేవారు. దీనిద్వారా అతి భారీ కృష్ణబిలాల ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిందీలో లోఫర్
కొత్త నటులతో లవ్‌స్టోరీ చరిత్రాత్మక సినిమాలు నాకు సరిపడవు దర్శకుడు పూరీజగన్నాథ్ వెల్లడి నర్సీపట్నంలో సందడి చేసిన లోఫర్ టీమ్ నర్సీపట్నం: లోఫర్ చిత్రాన్ని హిందీలో తీయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు పూరిజగన్నాథ్ వెల్లడించారు. తెలుగులో ఈ సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో హిందీలో నిర్మించే ఆలోచనలో ఉన్నామన్నారు. చిత్ర విజయయాత్రలో భాగంగా మంగళవారం నర్సీపట్నం శ్రీకన్య సినీమ్యాక్స్‌లో యూనిట్ సందడి చేసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ అమ్మ సెంట్‌మెంట్‌తో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోందన్నారు. లోఫర్ విజయం సాధించడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. చరిత్రాత్మక సినిమాలు తనకు సరిపడవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోఫర్‌ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. పూర్తిగా కొత్త నటీనటులతో లవ్‌స్టోరీ తీస్తానని పూరీజగన్నాథ్ చెప్పారు. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ లోఫర్ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు వచ్చిందన్నారు. మాస్ ఇమేజ్ వచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దిన పూరీకి రుణపడి ఉంటానన్నారు. విలన్లు వంశీ, రాజేష్ తదితరులు మాట్లాడారు. అనంతరం సంగీత దర్శకుడు సునీల్ ‘అమ్మ పాటను’ పాడి వినిపించారు. డ్యాన్సర్ రమ్య మాట్లాడారు. ఘన స్వాగతం వైఎస్సార్సీపీ నియోజకవర్గం కన్వీనర్, పూరీ జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్, అభిమానులు, యూత్ లోఫర్ టీమ్‌కు ఘనస్వాగతం పలి కారు. శ్రీకన్య మ్యాక్స్ మేనేజర్ సోమేష్ పూరిజగన్నాథ్ , వరుణ్‌తేజ్, నిర్మాత సి.కళ్యాణ్‌లను గజమాలతో ఘనంగా సత్కరించారు. -
'లోఫర్' మూవీ రివ్యూ
టైటిల్: లోఫర్ జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం: వరుణ్ తేజ్, దిశాపటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్ నిర్మాత: సివి రావు, శ్వేతాలానా, వరుణ్, తేజ సంగీతం: సునీల్ కశ్యప్ కంచె సినిమాతో ప్రయోగాత్మక చిత్రంతో కూడా మంచి సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్, తొలిసారిగా ఓ కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నంలో చేసిన సినిమా లోఫర్. టైటిల్ నుంచే అందరినీ ఆకర్షించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ తరువాత మరింత హైప్ క్రియేట్ చేసింది. టెంపర్ సినిమాతో ఈ ఏడాది మంచి సక్సెస్ సాధించిన పూరి జగన్నాథ్ ఆ తరువాత జ్యోతిలక్ష్మి సినిమాతో నిరాశపరిచాడు. ఈ లోఫర్‌తో తిరిగి ఫాంలోకి రావాలని తనకు బాగా కలిసొచ్చిన మాస్ హీరోయిజాన్ని నమ్ముకున్నాడు. మరి పూరి దర్శకత్వంలో లోఫర్గా మారిన వరుణ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడా..? తను అనుకున్నట్టుగా కమర్షియల్ హీరో టాగ్ సాధించాడా.. కథ : తాను ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోవటం కోసం కోట్ల ఆస్తిని కాదనుకొని వస్తుంది లక్ష్మి (రేవతి). కానీ తను నమ్మి వచ్చిన వ్యక్తి (పోసాని కృష్ణ మురళి) ఓ లోఫర్ అని తెలిసి అతనికి దూరమవ్వాలనుకుంటుంది. తనతో పాటు తన కొడుకును కూడా అతడికి దూరంగా పెంచాలనుకుంటుంది. ఈ లోగా అతను లక్ష్మి కొడుకు రాజా (వరుణ్ తేజ్) ను తీసుకొని జోధ్ పూర్ పారిపోతాడు. ఆ పిల్లాడిని కూడా తన లాగే లోఫర్లా పెంచుతాడు. తల్లి కామెర్లతో చనిపోయిందని చెప్పి కొడుకును నమ్మిస్తాడు. దొంగతనాలు, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలనకున్న కుటుంబసభ్యుల నుంచి పారిపోయిన పారిజాతం (దిశాపటాని) జోధ్‌పూర్‌లో ఉంటున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తుంది. జోధ్‌పూర్‌లో దిగగానే పోసాని కృష్ణమురళి ఆమె సెల్ ఫోన్ కొట్టేస్తాడు. తరువాత రాజా ఆమె బ్యాగ్ కొట్టేస్తాడు. అలా జోధ్‌పూర్‌లో రెండు మూడు సార్లు కలిసిన రాజా, పారిజాతం ప్రేమలో పడతారు. ఈ విషయాన్ని పారిజాతం తన మేనత్తకు చెబుతుంది. ఈ లోగా పారిజాతం ఉంటున్న ప్లేస్ కనిపెట్టిన ఆమె ఫ్యామిలీ జోధ్‌పూర్ వచ్చేస్తారు. వాళ్లు పారిజాతాన్ని తీసుకెళ్లే సమయంలో వరుణ్ ఆమె మేనత్తను చూసి షాక్ అవుతాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో రైల్లో వెళుతున్న పారిజాతాన్ని, ఆమె మేనత్తను పారిజాతం ఫ్యామిలీ పట్టుకుంటారు. తరువాత రాజా పారిజాతాన్ని కలిశాడా..? పారిజాతం మేనత్తకి రాజాకి సంబంధం ఏంటి..? చిన్నప్పటి నుంచి తల్లికి దూరంగా పెరిగిన రాజా తల్లిని ఎలా కలిశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నం చేసిన వరుణ్ పర్ఫామెన్స్లో మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్‌లో బాగా నటించాడు. యాక్షన్ సీక్వన్స్లతోనూ మాస్ ఆడియన్స్‌కు చేరువయ్యే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో కీలకమైన తల్లి పాత్రలో నటించిన రేవతి, ఆ క్యారెక్టర్‌కు తానే బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రతీ సీన్లోనూ తన సీనియారిటీని చూపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. రెగ్యులర్‌గా తను చేసే తరహా లోఫర్ క్యారెక్టర్లో కనిపించిన పోసాని పరవాలేదనిపించాడు. కొంత గ్యాప్ తరువాత ముఖేష్ రుషి ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్లో మెప్పించాడు. అలీ, బ్రహ్మనందం, సప్తగిరి, ధన్‌రాజ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తరువాత సెంటిమెంట్ జోలికి వెళ్లని పూరి జగన్నాథ్. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సెంటిమెంట్ సినిమా లోఫర్. దర్శకుడిగా రొటీన్ అనిపించిన పూరి, డైలాగ్ రైటర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్‌ని పక్కా కమర్షియల్ స్టార్‌గా ప్రజెంట్ చేయటంలో మంచి సక్సెస్ సాధించాడు. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదనిపించింది. సువ్వి సువ్వాలమ్మ పాట తప్ప గుర్తుండిపోయే పాటలు లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రొమాంటిక్ సాంగ్స్‌తో పాటు కోటలో తీసిన ఫైట్స్ సీక్వన్స్లో కెమరా వర్క్ చాలా బాగుంది. విశ్లేషణ: ఇప్పటివరకు ప్రయోగాత్మక చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, లోఫర్ సినిమాతో కమర్షియల్‌గా స్టార్ మారాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వరుణ్ కెరీర్ పరంగా లోఫర్ స్పెషల్ సినిమా అయినా.. పూరి పరంగా మాత్రం ఇది రొటీన్ సినిమానే.. రెగ్యులర్‌గా పూరి సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే ఫైట్ సీన్ పోకిరి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా చాలా సన్నివేశాల్లో పూరి గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఈసారి సెంటిమెంట్‌ను పండించటంలో కూడా పూరి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా తల్లి పాత్రకు రేవతి ఎంపిక చేసుకోవటంలోనే పూరి చాలావరకు విజయం సాధించేశాడు. భారీ అంచనాలతో మెగా అభిమానులుగా వెళ్లే ఆడియన్స్‌కు కాస్త నిరాశకలిగినా.. పూరి స్టైల్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా లోఫర్. ప్లస్ పాయింట్స్ : రేవతి వరుణ్ యాక్టింగ్ డైలాగ్స్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ ఫస్టాఫ్ కామెడీ ఓవరాల్‌గా లోఫర్ పూరికి రొటీన్ సినిమా, వరుణ్ తేజ్‌కి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ -
పవన్ నాకు దేవుడు
దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమానుల కోలాహలం మధ్య లోఫర్ ఆడియో సక్సెస్ మీట్ చినకాకాని(మంగళగిరి రూరల్): ‘మీకు పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్ అయితే.. నాకు దేవుడు’.. అని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో సోమవారం రాత్రి లోఫర్ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లోఫర్ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదన్నారు. హీరోయిన్ దిషా పఠానీ తొలి చిత్రంలోనే చక్కగా నటించిందని, చాలా మంచి డ్యాన్సర్ అని కొనియాడారు. హీరో వరుణ్‌తేజ్ నటన అద్భుతమన్నారు. మెగా కుటుంబంలో పెద్ద హీరోగా పేరుతెచ్చుకుంటారని చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూస్తే తప్పకుండా వరుణ్ ఫ్యాన్స్ అవుతారని, సినిమా అంత బాగా వచ్చిందని తెలిపారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ లోఫర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అశోక్‌కుమార్, మ్యూజిక్ డెరైక్టర్ సునీల్ కస్యప్, అసోసియేట్ డెరైక్టర్ కేఎస్ రాజు, హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, జీఎం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.