హిందీలో లోఫర్ | lofar remake in hindi, says puri jagannath | Sakshi
Sakshi News home page

హిందీలో లోఫర్

Dec 23 2015 12:03 PM | Updated on Mar 22 2019 1:53 PM

హిందీలో లోఫర్ - Sakshi

హిందీలో లోఫర్

లోఫర్ చిత్రాన్ని హిందీలో తీయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు పూరిజగన్నాథ్ వెల్లడించారు.

కొత్త నటులతో లవ్‌స్టోరీ
చరిత్రాత్మక సినిమాలు నాకు సరిపడవు
దర్శకుడు పూరీజగన్నాథ్ వెల్లడి
నర్సీపట్నంలో సందడి చేసిన లోఫర్ టీమ్

 
నర్సీపట్నం: లోఫర్ చిత్రాన్ని హిందీలో తీయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు పూరిజగన్నాథ్ వెల్లడించారు. తెలుగులో ఈ సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో హిందీలో నిర్మించే ఆలోచనలో ఉన్నామన్నారు. చిత్ర విజయయాత్రలో భాగంగా మంగళవారం నర్సీపట్నం శ్రీకన్య సినీమ్యాక్స్‌లో యూనిట్ సందడి చేసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ అమ్మ సెంట్‌మెంట్‌తో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోందన్నారు.

లోఫర్  విజయం సాధించడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. చరిత్రాత్మక సినిమాలు తనకు సరిపడవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోఫర్‌ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. పూర్తిగా కొత్త నటీనటులతో లవ్‌స్టోరీ తీస్తానని పూరీజగన్నాథ్ చెప్పారు. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ లోఫర్ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు వచ్చిందన్నారు. మాస్ ఇమేజ్ వచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దిన పూరీకి రుణపడి ఉంటానన్నారు. విలన్లు వంశీ, రాజేష్ తదితరులు మాట్లాడారు. అనంతరం సంగీత దర్శకుడు సునీల్ ‘అమ్మ పాటను’ పాడి వినిపించారు. డ్యాన్సర్ రమ్య మాట్లాడారు.


ఘన స్వాగతం
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం కన్వీనర్, పూరీ జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్, అభిమానులు, యూత్  లోఫర్ టీమ్‌కు ఘనస్వాగతం పలి కారు. శ్రీకన్య మ్యాక్స్ మేనేజర్ సోమేష్ పూరిజగన్నాథ్ , వరుణ్‌తేజ్, నిర్మాత సి.కళ్యాణ్‌లను గజమాలతో ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement