'పోలవరం' ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంది? | Pattiseema lift scheme of no use, says ummareddy venkateswarlu | Sakshi
Sakshi News home page

'పోలవరం' ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంది?

Apr 9 2016 3:08 PM | Updated on Aug 21 2018 8:34 PM

'పోలవరం' ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంది? - Sakshi

'పోలవరం' ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంది?

పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందా ? లేక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో్ ఉందో ? అర్థం కాని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సందేహం వ్యక్తం చేశారు.

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందా ? లేక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో్ ఉందో ? అర్థం కాని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సందేహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ... 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అసాధ్యమనిపిస్తోందని తెలిపారు. పట్టిసీమ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నదుల అసుసంధానం అంటే రెండు, మూడు లిఫ్ట్లు పెట్టి నీళ్లు తోడటం కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement