'అందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారు' | p madhu takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

'అందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారు'

Apr 20 2016 10:27 AM | Updated on Aug 13 2018 8:10 PM

'అందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారు' - Sakshi

'అందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారు'

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో నిప్పులు చెరిగారు.

తిరుపతి : చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారణమని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా బలం పెరిగిందనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవా చేశారు. వాపును చూసి టీడీపీ బలమనుకుంటుందని విమర్శించారు.

ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తే అది సాధ్యం కాదని పి.మధు స్పష్టం చేశారు. దళితుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. వేసవిలో మజ్జిగ సరఫరా చేస్తామని ప్రభుత్వం అంటుందని కానీ అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ఫ్యాక్టరీ హెరిటేజ్ ఉత్పత్తులను అమ్ముకోవడానికి చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని పి.మధు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement