రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు | one person wounded in accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Aug 9 2016 11:59 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రంలోని బ్రిడ్జి వద్ద నెక్కొండ–నర్సంపేట ప్రధాన రహదారిపైన మంగళవారం జరిగింది.

చెన్నారావుపేట : రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రంలోని  బ్రిడ్జి వద్ద నెక్కొండ–నర్సంపేట ప్రధాన రహదారిపైన  మంగళవారం జరిగింది. నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామానికి చెందిన భూక్య మంగీలాల్‌ ద్విచక్రవాహనంపై ఖానాపురం మండలం మంగళవారిపేటకు వెళ్లి తిరిగొస్తుండగా బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని 108లో నర్సంపేట ఏరియా ఆ స్పత్రికి తరలించి ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement