రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | one men dead in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Nov 30 2016 10:44 PM | Updated on Sep 4 2017 9:32 PM

మండలంలోని శెట్టిగుంట సమీపంలో కడపతిరుపతి హైవే పక్కన బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేరంగుల వెంకట రమణ (25) మృతి చెందాడు. ఏపీ 04 ఏయూ 5158 నంబరు ద్విచక్ర వాహనంలో వెళతూ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్న ఆయనను ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గుర్తించి వెంటనే 108కు ఫోన్‌ చేశారు.

రైల్వేకోడూరు రూరల్‌:  మండలంలోని శెట్టిగుంట సమీపంలో కడపతిరుపతి హైవే పక్కన బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేరంగుల వెంకట రమణ (25) మృతి చెందాడు. ఏపీ 04 ఏయూ 5158 నంబరు ద్విచక్ర వాహనంలో వెళతూ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్న ఆయనను ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గుర్తించి వెంటనే 108కు ఫోన్‌ చేశారు.108 వాహనంలో గాయపడిని వ్యక్తిని తిరుపతి రుయాకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి బంధువు ఆవులకుంట రామయ్య తెలిపారు. మృతుడికి భార్య , 2 సంవత్సరాల కుమార్తె మీనాక్షి ఉన్నారు. మృతుని స్వగ్రామం జానకిపురం కాగా, వీవీ.కండ్రిక పంచాయతీలో ఉన్న ఆర్‌.వడ్డిపల్లెలో ఇతను వివాహం చేసుకొని అక్కడే కాపురం ఉంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement