సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది.
- మరొకరికి గాయాలు
సదాశివనగర్(నిజామాబాద్ జిల్లా)
సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దోమకొండ మండల కేంద్రానికి చెందిన కూర శ్రీనివాస్(35) అనే వ్యక్తి మృతిచెందాడు. నందు అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.