బోనాల అన్నదానంలో అకాతాయి ఉమ్మడంతో.. | one fellow wrongly split in god rice | Sakshi
Sakshi News home page

బోనాల అన్నదానంలో అకాతాయి ఉమ్మడంతో..

Aug 1 2016 6:29 AM | Updated on Sep 4 2018 5:21 PM

భాదితుల నుండి వివరాలు సేకరిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఎంఏజావీద్‌ - Sakshi

భాదితుల నుండి వివరాలు సేకరిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఎంఏజావీద్‌

అన్నదానం నిర్వహిస్తుండగా వారి చేతిలోని భోజనాల్లో ఉమ్మి వేయడంతో ఈ పరిస్థితులకు దారి తీసింది.

లంగర్‌హౌస్‌: బోనాల సందర్భంగా లంగర్‌హౌస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీకి చెందిన నాయకుడు, అతడి కుమారుడు వెకిలి చేష్టలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బోనాల సందర్భంగా అన్నదానం నిర్వహిస్తుండగా వారి చేతిలోని భోజనాల్లో ఉమ్మి వేయడంతో ఈ పరిస్థితులకు దారి తీసింది.

ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడంతో వారు వచ్చి సురేందర్, సంజయ్, సుభాష్‌లపై దాడి చేసి గాయపర్చారు. దీంతో పలువురు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement