రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one dies in kodhada road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Dec 8 2016 9:20 AM | Updated on Aug 30 2018 4:07 PM

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జాతీయరహదారిపై గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.

కోదాడ(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జాతీయరహదారిపై గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కోదాడ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే విజయవాడకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement