ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. వ్యక్తి మృతి | one dies as car turns turtle in buvanagiri | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. వ్యక్తి మృతి

Feb 26 2017 12:44 PM | Updated on Sep 5 2017 4:41 AM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

యాదాద్రి భువనగిరి:
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ఫ్లైఓవర్‌పై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తు‍న్న కారు రాయగిరి ఫ్లైఓవర్‌పైకి రాగానే అదుపుతప్పి బోల్తాకొట్టింది.

దీంతో కారులో ఉ‍న్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వాహనదారులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement