అక్కను పిలుచుకొచ్చేందుకు వెళ్తూ.. | one died in road accident | Sakshi
Sakshi News home page

అక్కను పిలుచుకొచ్చేందుకు వెళ్తూ..

Apr 17 2017 12:34 AM | Updated on Apr 3 2019 7:53 PM

మండల పరిధిలోని గార్గేయపురం శివారుల్లోని చెరువుకట్ట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారుడు రెడ్డిపోగు చెంచన్న (26) అక్కడికక్కడే మృతి చెందాడు.

- రోడ్డు ప్రమాదంలో గార్గేయపురం వాసి మృతి
- గ్రామశివారులోనే ఘటన
 
కర్నూలు: మండల పరిధిలోని గార్గేయపురం శివారుల్లోని చెరువుకట్ట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారుడు రెడ్డిపోగు చెంచన్న (26) అక్కడికక్కడే మృతి చెందాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న చెంచన్న(26)మునగాలపాడులో ఉన్న అక్కను పండుగకు పిలుచుకొని వచ్చేందుకు శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌(ఏపీ 21 బీహెచ్‌ 4131)పై బయలుదేరాడు. గ్రామ శివారుల్లోని చెరువు కట్ట దగ్గరకు వచ్చే సరికి వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచన్న అక్కడిక్కడే మరణించాడు. సోదరుడు రవి  ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తాలుకా ఎస్‌ఐ గఫూర్‌ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement