ఓనమ్‌.. అదిరెన్‌ | onam celebrations | Sakshi
Sakshi News home page

ఓనమ్‌.. అదిరెన్‌

Sep 8 2016 10:43 PM | Updated on Sep 4 2017 12:41 PM

ఓనమ్‌.. అదిరెన్‌

ఓనమ్‌.. అదిరెన్‌

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోనే అక్షరాస్యతలో ముందున్న కేరళ రాష్ట్ర సంప్రదాయ ఓనమ్‌ వేడుకలను నగరంలోని ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ సభ్యులు ఉత్సాహంగా నిర్వహించారు. కేరళ సంప్రదాయ వస్త్రాలను ధరించి ప్రత్యేకంగా నిర్వహించిన క్యాట్‌వాక్‌ ఆకట్టుకుంది.

విజయవాడ (లబ్బీపేట) : ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోనే అక్షరాస్యతలో ముందున్న కేరళ రాష్ట్ర సంప్రదాయ ఓనమ్‌ వేడుకలను నగరంలోని ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ సభ్యులు ఉత్సాహంగా నిర్వహించారు. కేరళ సంప్రదాయ వస్త్రాలను ధరించి ప్రత్యేకంగా నిర్వహించిన క్యాట్‌వాక్‌ ఆకట్టుకుంది. కేరళ వస్త్రాలతో నృత్యాలు, దీపాలు, పూల అలంకరణలతో హోటల్‌ మినర్వా గ్రాండ్‌లో గురువారం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీదేవి రంగ, సుచిత్ర మాట్లాడుతూ అక్షరాస్యతలో మన దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన కేరళను స్ఫూర్తిగా తీసుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. వాటిని హ్యాపీ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్‌ సావిత్రితోపాటు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. 
మహిళా టీచర్లకు సన్మానం
గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 21 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త చుక్కపల్లి సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం రోజు ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement