లైంగిక దాడి నిందితుడి అరెస్టు | old manarrested for harasing child | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి నిందితుడి అరెస్టు

Oct 19 2016 11:37 PM | Updated on Oct 9 2018 5:39 PM

లైంగిక దాడి నిందితుడి అరెస్టు - Sakshi

లైంగిక దాడి నిందితుడి అరెస్టు

ఆలమూరు : సభ్య సమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వేమగిరి జాన్‌ (65) ఆలమూరు పోలీసులు బుధవారం ఆరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచం

ఆలమూరు : సభ్య సమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వేమగిరి జాన్‌ (65) ఆలమూరు పోలీసులు బుధవారం ఆరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మండపేట సీఐ వి.పుల్లారావు పాల్గొని కేసు వివరాలను తెలియజేశారు. ఈనెల 16న స్థానిక ఎస్సీ పేటలోని చిన్నారికి చాక్లెట్‌ ఇస్తానని మాయ మాటలు చెప్పి జాన్‌ తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ చిన్నారి నోట్లో చాక్లెట్‌ను ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రమైన నొప్పి వస్తుందంటూ ఆ చిన్నారి ఏడుస్తూ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటికే రక్తస్రావం అవుతున్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై పి.దొరరాజు ఆధ్వర్యంలో పోలీసుల బృందం అప్పటికే పరారీలో ఉన్న నిందితుడు జాన్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు జాన్‌ను బుధవారం అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆలమూరు ఏఎఫ్‌సీఎం కోర్టులో  నిందితుడిని గురువారం హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement