సీఐపై దాడిచేసిన కానిస్టేబుల్‌కు నోటీసులు | notices issued to constable for assaulting CI | Sakshi
Sakshi News home page

సీఐపై దాడిచేసిన కానిస్టేబుల్‌కు నోటీసులు

Jul 16 2016 7:50 PM | Updated on Aug 11 2018 8:15 PM

మద్యం సేవించి ట్రాఫిక్ సీఐపై దాడిచేసిన కానిస్టేబుల్‌పై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

నిజామాబాద్: మద్యం సేవించి ట్రాఫిక్ సీఐపై దాడిచేసిన కానిస్టేబుల్‌పై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సీఐ శేఖర్‌రెడ్డిపై గురువారం రాత్రి మహిళ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సల్మాన్‌రాజ్ దాడిచేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పోలీ సులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు నగరంలోని పలు ప్రాం తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫీక్ సీఐ కంఠేశ్వర్‌లో తనిఖీలు చేశారు. అదే సమయంలో కానిస్టేబుల్ సల్మాన్‌రాజ్ మద్యం సేవించి అటువైపు వెళ్తుండగా ట్రాఫిక్ సిబ్బంది అతడిని ఆపారు.

బ్రీత్ ఎనలైజర్ చేయగా 123 ఆల్కాహాల్ శాతం వచ్చింది. సీఐ అతనిపై కేసు నమోదు చేస్తుండగా సదరు కానిస్టేబుల్ ఆగ్రహంతో ఊగిపోతూ సీఐ చొక్కపట్టుకుని దాడిచేసి తోసేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సై నరేశ్, కానిస్టేబుల్స్ సల్మాన్‌రాజ్‌ను మూడో టౌన్ పోలీ స్‌స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం సదరు కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు. స్టేషన్‌లో ఎస్సై శ్రీహరి సమక్షంలో మరోసారి బ్రీత్ ఎనలైజర్ చే సేందుకు యత్నించగా హంగామా చేశాడు. అనంతరం మెడికల్ పరీక్షలకు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అక్కడ శాంపిల్స్ తీసుకున్నారు. సీఐ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై శ్రీహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement