
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంచలన ఆరోపణలకు దిగారు. తన పార్టీకి చెందిన వారే తనపై దాడికి యత్నించారని అన్నారాయన. ఈ విషయంపై సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు.
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దుండగులు దాడికి యత్నించారు. మాణికేశ్వర్‌నగర్‌లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే గన్‌మెన్‌ల సమయస్పూర్తితో ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై సాక్షితో సోమవారం ఆయన మాట్లాడారు.
‘‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగా దాడి ప్రయత్నం జరిగిందనే అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓక నేత(గొల్లకిట్టు) నన్ను టార్గెట్ చేశారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఆ వెంటనే నా సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారు. నిన్న నాపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే. అందులో ముగ్గురిని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చా. అయితే.. ఇది పార్టీ పెద్దలకు చెప్పేంత పెద్ద ఇష్యూ కాదన్న ఆయన.. మళ్ళీ పోలీసులను కలిసి అన్ని వివరాలు చెప్తానన్నారు.
ఆదివారం సాయంత్రం.. నియోజవర్గంలోని మాణికేశ్వర్‌నగర్‌లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాదాపు 20 మంది దాడియత్నం చేశారు. అద్దాలు దించాలంటూ కారును వెంబడించారు. అప్రమత్తమైన గన్‌మెన్‌లు వాహనాన్ని నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. ఈ ఘటనపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
