నీటి కొరత లేదు | not of water scare | Sakshi
Sakshi News home page

నీటి కొరత లేదు

Feb 10 2017 10:20 PM | Updated on Sep 5 2017 3:23 AM

నీటి కొరత లేదు

నీటి కొరత లేదు

మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పీఏబీఆర్‌) వద్ద ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత లేదని డీఈ పక్కీరప్ప శుక్రవారం తెలిపారు.

కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పీఏబీఆర్‌) వద్ద ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత లేదని డీఈ పక్కీరప్ప శుక్రవారం తెలిపారు. డ్యాంలో నీటి మట్టం పెరుగుతోందన్నారు. 18  రోజుల క్రితం డ్యాంలో 1.8 టీఎంసీల నీరు మాత్రమే ఉండేదన్నారు.

కానీ ఇప్పుడు 2.1 టీఎంసీల నీరుందన్నారు. అంతేకాకుండా జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రోజూ 550 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. అలాగే జల విద్యుత్‌ కేంద్రలో విద్యుత్‌ ఉత్పత్తి కోసం రోజూ విడుదల చేసే 800 క్యూసెక్కుల నీటిని నిలిపేశామన్నారు. దీంతో ఔట్‌ఫ్లో తగ్గిపోయిందన్నారు. వేసవిరీత్యా ఈ మూడు తాగునీటి ప్రాజెక్టులకు 1.5 టీఎంసీల వరకు నీటిని నిల్వ ఉంచుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement