పీఏబీఆర్‌ డ్యాంలో 2.3 టీఎంసీల నీరు | 2.3 tmc water in pabr dam | Sakshi
Sakshi News home page

పీఏబీఆర్‌ డ్యాంలో 2.3 టీఎంసీల నీరు

Mar 16 2017 11:03 PM | Updated on Sep 5 2017 6:16 AM

పీఏబీఆర్‌ డ్యాంలో 2.3 టీఎంసీల నీరు

పీఏబీఆర్‌ డ్యాంలో 2.3 టీఎంసీల నీరు

మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం)లో 2.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్‌ డీఈ పక్కీరప్ప పేర్కొన్నారు.

కూడేరు (ఉరవకొండ) : మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం)లో 2.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్‌ డీఈ పక్కీరప్ప పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్యాంలోకి ఇన్‌ఫ్లో పూర్తిగా బంద్‌ అయ్యిందన్నారు. అవుట్‌ప్లో ఉందన్నారు. డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. డ్యాంలో ఉన్న జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో ìనీటి మట్టం తగ్గలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement