ధర్మవరం కుడికాలువకు నీటి సరఫరా బంద్‌ | water bundh of dharmavaram right canal | Sakshi
Sakshi News home page

ధర్మవరం కుడికాలువకు నీటి సరఫరా బంద్‌

Dec 24 2016 10:59 PM | Updated on Sep 4 2017 11:31 PM

ధర్మవరం కుడికాలువకు నీటి సరఫరా బంద్‌

ధర్మవరం కుడికాలువకు నీటి సరఫరా బంద్‌

మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు శనివారం నీటి సరఫరా బంద్‌ చేశారు.

కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు శనివారం నీటి సరఫరా బంద్‌  చేశారు. కుడి కాలువకు గత నెల 1న నీటిని విడుదల చేసిన విషయం విదితమే. డ్యాం డీఈ పక్కీరప్ప మాట్లాడుతూ కుడి కాలువకు నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 2.565 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. రోజుకు 500 నుంచి 700 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా అయ్యిందన్నారు. 112 కిలో మీటర్ల దూరం ఉన్న ధర్మవరం కుడికాలువ  కింద ఉన్న 49 చెరువులన్నింటికీ తాగునీటి సౌకర్యార్థం సుమారు 30 శాతానికి పైగానే నీటిని నింపినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement