నాన్‌ టీచింగ్‌ పోస్టుల ప్రమోషన్లకు అనుమతి | non-teaching | Sakshi
Sakshi News home page

నాన్‌ టీచింగ్‌ పోస్టుల ప్రమోషన్లకు అనుమతి

Aug 11 2016 9:41 PM | Updated on Sep 4 2017 8:52 AM

జేఎన్‌టీయూ కాకినాడలో వివిధ విభాగాల్లో నాన్‌టీచింగ్‌ పోస్టుల ప్రమోషన్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప గురువారం జీవో నెంబర్‌ :157 జారీ చేశారు. జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఒకటి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌–1, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 1, సూపరింటెండెంట్‌–2, సీనియర్‌ అసిస్టెంట్‌–3, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ –1, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌–1 పోస్టుల ప్రమోషన్లకు ఉత్తర్వుల

బాలాజీచెరువు(కాకినాడ) :
జేఎన్‌టీయూ కాకినాడలో వివిధ విభాగాల్లో  నాన్‌టీచింగ్‌ పోస్టుల  ప్రమోషన్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప గురువారం జీవో నెంబర్‌ :157 జారీ చేశారు. జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఒకటి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌–1, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 1, సూపరింటెండెంట్‌–2, సీనియర్‌ అసిస్టెంట్‌–3, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ –1, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌–1 పోస్టుల ప్రమోషన్లకు  ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్‌ ఆఫీసర్‌ మినహా మిగతా పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. ఆ ఒక్క పోస్టుకూ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement