రేపు అనంతకు రానున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు | newzeland cricket team came to anantapur | Sakshi
Sakshi News home page

రేపు అనంతకు రానున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు

Jul 6 2017 9:50 PM | Updated on Oct 17 2018 4:43 PM

రేపు అనంతకు రానున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు - Sakshi

రేపు అనంతకు రానున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు

న్యూజిలాండ్‌ జూనియర్‌ క్రికెట్‌ జట్టు ఈనెల 8న అనంతపురానికి రానున్నట్లు జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ షాహబుద్దీన్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : న్యూజిలాండ్‌ జూనియర్‌ క్రికెట్‌ జట్టు ఈనెల 8న అనంతపురానికి రానున్నట్లు జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ షాహబుద్దీన్‌ తెలిపారు.  స్థానిక అనంత క్రీడామైదానంలో అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్టుతో న్యూజిలాండ్‌ వన్‌డే మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా  8 నుంచి 13వ తేది వరకు న్యూజిలాండ్‌ జూనియర్స్‌ జట్టు అనంతపురం జట్టుతో తలపడుతుందన్నారు.  20 నుంచి 27వ తేది వరకు న్యూజిలాండ్‌ సీనియర్స్‌ జట్టు కూడా పర్యటిస్తుందని తెలిపారు. ఇప్పటికే న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు అక్కడి నుంచి బయలు దేరిందని చెప్పారు. వారు శుక్రవారం నగరానికి చేరుకుంటారన్నారు. స్థానిక ఆర్డీటీ క్రీడా మైదానంలోనే వారు బస చేస్తారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement