‘తీవ్రస్థాయిలో బాలకృష్ణ పీఏ అవినీతి’ | naveen nischal takes on balakrishna | Sakshi
Sakshi News home page

‘తీవ్రస్థాయిలో బాలకృష్ణ పీఏ అవినీతి’

Oct 23 2016 2:42 PM | Updated on Aug 29 2018 1:59 PM

‘తీవ్రస్థాయిలో బాలకృష్ణ పీఏ అవినీతి’ - Sakshi

‘తీవ్రస్థాయిలో బాలకృష్ణ పీఏ అవినీతి’

హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్.. సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణపై మండిపడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్.. సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణపై మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నారని విమర్శించారు.  

బాలకృష్ణ మూడు నెలల్లో ఒక రోజు మాత్రమే హిందూపురంలో పర్యటిస్తున్నారని నవీన్ నిశ్చల్ అన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పీఏ అవినీతి తీవ్రస్థాయికి చేరిందని ఆరోపించారు. బాలకృష్ణకు హిందూపురం ప్రజల కష్టాలు పట్టవని నవీన్ విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement