11న జాతీయ లోక్‌ అదాలత్‌ | national ™lokadalat on 11ht | Sakshi
Sakshi News home page

11న జాతీయ లోక్‌ అదాలత్‌

Jan 26 2017 12:53 AM | Updated on Sep 5 2017 2:06 AM

ఫిబ్రవరి 11న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు.

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి
 
కర్నూలు(లీగల్‌): ఫిబ్రవరి 11న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్‌లో ప్యానల్‌ అడ్వకేట్స్, రీటైనర్స్, జువైనల్‌ బోర్డు అడ్వకేట్స్, లీగల్‌ ఎయిడ్‌ అడ్వకేట్స్, పారాలీగల్‌ వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 11న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో రాజీ కాగల క్రిమినల్‌ కేసులు, అన్ని సివిల్‌ కేసులు, ప్రిలిటిగేషన్‌ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు పరిష్కారం చేస్తారన్నారు. కక్షిదారులకు వీలైనంత వరకు ప్రచారం కల్పించి పాత కేసులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement