కర్నూలు నగర శివారు నన్నూరులో సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న రఫీక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నారాయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Feb 1 2017 9:48 PM | Updated on Nov 9 2018 5:02 PM
కర్నూలు(అర్బన్): కర్నూలు నగర శివారు నన్నూరులో సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న రఫీక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డోన్ పట్టణం కొత్తపేటకు చెందిన లాల్‌బాషాæ కుమారుడైన రఫీక్ గత సంవత్సరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ కోర్సులో చదువుతూ మధ్యలో ఆపేశాడు. తిరిగి ఈ విద్యా సంవత్సరం నన్నూరులోని నారాయణ కళాశాలలో చేరి బైపీసీ గ్రూపు తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రీఫైనల్ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్థాపానికి లోనయ్యాడు. కళాశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మంగళవారం రాత్రి హెయిర్ డయ్యర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కళాశాల సిబ్బంది వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
Advertisement
Advertisement