అలరించిన సంగీత విభావరి | musical fest at puttapurthi | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత విభావరి

Dec 11 2016 1:30 AM | Updated on Sep 4 2017 10:23 PM

సత్యసాయిని కీర్తిస్తూ సుమధుర స్వరాలతో సాయివిద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.

పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ సుమధుర స్వరాలతో సాయివిద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శనివారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి మిరుపురి సంగీత కళాశాలకు చెందిన పూర్వవిద్యార్థులు సత్యసాయిపై కృతజ్ఞతా భావాన్ని చాటుతూ నక్షత్ర వీణ అన్న పేరుతో వీణా వాయిద్య  కచేరి నిర్వహించారు. 27 మంది ప్రావీణ్యులైన వీణా వాయిద్య కళాకారులు విభావరిలో పాల్గొన్నారు. చక్కటి స్వరాలతో విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్‌ సభా మందిరం మార్మోగింది. 

Advertisement
 
Advertisement
Advertisement