ముంబై అనుభవం లేకుంటే వేల ప్రాణాలు గాల్లో.. : అమెరికా

 26/11 Mumbai Attacks Insight Helped Prevent A Thousand Deaths In Las Vegas

న్యూయార్క్‌ : ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనుభవం వల్లే లాస్‌వేగాస్‌లో వేల ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడిందని అమెరికా పోలీసు అధికారి చెప్పారు. ఆ అనుభవంతోనే తాము శత్రువును అత్యంత శీఘ్రంగా మట్టుపెట్టగలిగామని లేదంటే వేల ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. లాస్‌ వేగాస్‌లో స్టీఫెన్‌ పెడ్డాక్‌(64) అనే ఉన్మాది విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58మంది ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. 500మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. అయితే, అతడిని మట్టుబెట్టడంలో జోసెఫ్‌ లాంబోర్డ్‌ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయనన లాస్‌ వేగాస్‌ మెట్రోపాలిటన్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో షెరిఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

గతంలో ఆయన ముంబయిలో దాడి జరిగినప్పుడు అమెరికన్లు కూడా చనిపోయిన నేపథ్యంలో ఆ దాడి పూర్వపరాలు తెలుసుకున్నారు. అలాగే, ముంబయి పోలీసులు, భారత ఆర్మీ ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టారో తెలుసుకున్నారు. అలాంటి సంఘటనే తమ వద్ద జరిగితే ఎలా స్పందించాలనే విషయంలో ప్రత్యేకంగా తమ వద్ద ఉన్న పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరోజు సంగీత విభావరిపై కాల్పులు జరుగుతుండగా వెంటనే స్పందించి పోలీసులు నేరుగా ఉన్మాది గదిలోకి దూసుకెళ్లి అతడు హతమయ్యేలా చేశారు. లేదంటే ఆ రోజు వేల ప్రాణాలు పోయేవి. దీనికి సంబంధించి లాండోర్డ్‌ మాట్లాడుతూ..

'భారత్‌లోని ముంబయిలో పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడి మాకు ఓ అనుభవం. దాని ద్వారానే మేం వేల ప్రాణాలు రక్షించుకోగలిగాం. ఈ విషయాన్ని అమెరికన్లు అర్ధం చేసుకోవాలి. సంగీత విభావరిలో దాదాపు 22 వేల మంది ప్రేక్షకులు ఉన్నారు. అతడు విచక్షణ రహితంగా వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. శీఘ్రంగా స్పందించిన మా టీం అతడి గదికి వెళ్లి అంతమయ్యేలా చేసింది. ఆ హోటల్‌ గది నిండా ఆయుధాలు, షార్ప్ విపన్స్‌, పెద్ద మొత్తంలో గన్‌ పౌడర్స్‌ ఉన్నాయి. ఒక ఆయుధ మార్కెట్‌లాగా ఆ ఉన్మాది ఉన్న గది కనిపించింది. భారీ విధ్వంసం సృష్టించగల 24 అత్యాధునిక మెషిన్‌ గన్లు, తుపాకులు, రాకెట్‌ లాంచర్లు ఉన్నాయి. ఆ గది నుంచి వేర్వేరు ప్రాంతాలు అతడు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టాడు. మూడు మానిటర్లు కూడా సిద్ధం చేసుకొని ఉన్నాడు. వాటన్నింటిని ఉపయోగించినట్లేయితే కచ్చితంగా వేల ప్రాణాలు పోయేవి. కానీ, దానిని నిలువరించగలిగాం' అని వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top